Ras Kik Coco : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జియో నెట్, ఫైబర్ నెట్ సేవలతో మధ్యతరగతి ప్రజల్లో వెలుగులు నింపిన విషయం తెలిసిందే. తాజాగా సామ్రాజ్యాన్ని కూల్ డ్రింక్స్ వ్యాపారంలోనూ విస్తరించాలని రిలయన్స్ సంస్థ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ రూ. 16.48 లక్షల కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సాఫ్ట్ కూల్ డ్రింక్ బ్రాండ్ కంపాను రిలయన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Read Also:Prashanth Varma : హాలీవుడ్ రేంజ్ లో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా ఆఫీస్!
రూ. 10కే కూల్ డ్రింక్..
భారతీయ సంప్రదాయం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రజల టేస్టుకు తగ్గట్లుగానే రాస్ కిక్ అనే పేరుతో గ్లూకో ఎనర్జీ కూల్ డ్రింక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రధానంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ను టార్గెట్ చేస్తూ ధరను కేవలం రూ. 10గా నిర్ణయించింది. రాస్ కిక్ లో భారతీయ సంప్రదాయ టేస్టులకు తగ్గట్లుగా ప్రస్తుతం మ్యాంగో, ఆపిల్, మిక్స్ డ్ ఫ్రూట్, కొకోనట్ వాటర్, నింబూ.. వంటి రుచులతో ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న సమ్మర్ లో ఈ డ్రింక్స్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది.
Read Also:Game Changer : రూమర్లకు చెక్.. “గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ స్టార్ట్
టాటాకు పోటీగా…
బెవెరేజెస్ మార్కెట్ లో ఇప్పటివరకూ తిరుగులేని బ్రాండ్ గా పేరున్న టాటా గ్లూకో ప్లస్ కు ఈ రాస్ కిక్ కూల్ డ్రింక్ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.టాటాతో పాటు ఇతర బెవెరేజెస్ సంస్థలనూ అధిగమించి ఈ వ్యాపారంలోనూ తిరుగులేని శక్తిగా ఎదగాలని రిలయన్స్ సంస్థ అడుగులు వేస్తోంది.