Prashanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంత్ వర్మ క్రేజ్ నేడు పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా `అ` సినిమాతో మొదలై హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ సినిమాతో స్పెషల్ గా పీసీయూ యూనివర్స్ క్రియేట్ చేశాడు. ఇదే యూనివర్స్ నుంచి ఇక వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అతడు ఇన్నో వేటివ్ డైరెక్టర్ అని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. అయితే అతడి ఐడియాలజీ, విజన్ కి తగ్గట్లు ఇంత వరకు సొంత ఆఫీసును నిర్మించుకోలేకపోయాడు ప్రశాంత్ వర్మ. ఫేమస్ అయిన డైరెక్టర్లు అందరికీ స్పెషల్ గా ఆఫీసులు ఉంటాయి. స్టోరీ డిస్కషన్, సినిమా కి సంబంధించిన పనులన్నీ అక్కడ నుంచే మొదలవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఏకంగా హాలీవుడ్ రేంజ్ విజన్ తోనే తన ఆఫీసును నిర్మిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఏకంగా కాచిగూడ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. కాచిగూడలోని అగ్రశ్రేణి ఆర్కిటెక్ట్‌ల పర్యవేక్షణలో పెద్ద భవనాన్ని తన ఆఫీస్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
Read Also:Game Changer : రూమర్లకు చెక్.. “గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ స్టార్ట్
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు, సినిమాకి సంబంధించి ఏ టూ జెడ్ ప్రతి విషయం అక్కడ నుంచి ఆపరేట్ అయ్యే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందిస్తున్నాడట. స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి సెట్స్ కి వెళ్లే వరకూ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులన్నీ అదే ఆఫీస్ లో పూర్తయ్యే విధంగా రూపొందుతుందట. మరో పని కోసం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చెన్నై, ముంబై అంటూ తిరగకుండా తన ఐడియాలజీ, విజన్ కి తగ్గట్లు అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండే విధంగా రెడీ చేస్తున్నాడట. రైటర్స్ టీమ్, విఎఫ్ ఎక్స్ టీమ్, పీవీసీయూ ఉద్యోగులు ఇలా అందర్నీ ఒకే తాటిపై కి తీసుకొచ్చి తన ఆఫీసు నుంచే పని చేయించేలా వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆఫీస్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ రేంజ్ లో ఆఫీస్ ఇంత వరకూ టాలీవుడ్ లో ఏ దర్శకులకు లేదు. టాలీవుడ్ లో ఖరీదైన సినిమా ఆఫీస్ ఏది అంటే? వెంటనే పూరి జగన్నాథ్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కేవ్ గుర్తొస్తుంది. ఆయన ఆ కేవ్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. హౌస్ కం ఆఫీస్ గా దాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడా కేవ్ ని మించి ప్రశాంత్ వర్మ సినిమా ఆఫీస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also:Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?