ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వస్తున్న సినిమా లవ్ మీ .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు..
ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి.. విభిన్న కథ తో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. మే 25 న ఈ సినిమా విడుదల కాబోతుంది.. దెయ్యాన్ని ప్రేమించడం కోసం.. హీరో దెయ్యాన్ని వెతుకుంటూ వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంది. దాంతో మూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి..
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘రావాలి రా ‘ అంటూ దెయ్యాలు పాడే సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది.. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.. దిల్ రాజు పక్కా ప్లాన్ తో జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుంది..ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు..