పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విమర్శలు గుప్పించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశామని ఆయన అన్నారు. అయితే.. పార్టీ మారి మాట్లాడాలే తప్ప పార్టీలో ఉంటూ జాతీయ పార్టీ నాయకుడు కేసీఆర్ పై అనుచితంగా మాట్లాడడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు చెందట్లేదా అని ఆయన ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి మోసం చేస్తూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన గత ఎన్నికల్లో అనేక మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ లో ఉన్నప్పుడు ఎడవల్లికి టికెట్ ఇస్తానని చెప్పి వనమాకు టికెట్ ఇచ్చారని, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి చెందిన తర్వాత వారి సతీమణి నామినేషన్ వేసిన క్రమంలో పొంగులేటి టీఆర్ఎస్ పార్టీలోకి చేరింది వాస్తవం కాదా అని ఆయన అన్నారు. పార్టీ మారకుండా పార్టీలో ఉంటూ కేసీఆర్ ని విమర్శించడం సరైనది కాదని, మిగతా వారి పైన కూడా సస్పెండ్ వేటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also Read : Niharika Konidela: మొన్న చైతన్య.. నేడు నిహారిక.. ఏంటీ విడాకుల గోల..?
అంతేకాకుండా.. ‘జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంటే.. జరగలేదనే చెప్పే వాళ్ళ మాటలు ప్రజలు నమ్మరు. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతోంది వాళ్లు అంతర్మాదంలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పార్టీ కి పోవాలో తెలియట్లేదు ఏం అర్థం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ జిల్లాలో ఊహల కందని అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరగలేదని విమర్శించడం సరైంది కాదు. రేపు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారో తెలిసిపోతుంది. ఏఎన్నిక జరిగినా ప్రజలందరూ కేసీఆర్ వెంటే నిలబడ్డారు ఇలాంటి. వెన్నుపోటు దారులు తప్ప. పార్టీలో అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు కూడ పోవడం సిగ్గు చేటు. కేసీఆర్ పై నిందలేసే వాళ్ళపై ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తారు. డబ్బు ఉందని చెప్పేసి ఏదో అహంగా మాట్లాడి కోనగలుగుతనకుంటే ఖమ్మం జిల్లా ప్రజానీకం చాల చైతన్యవంతమైన ప్రజానీకం. పదికి పది అన్ని నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా 100% మేమే గెలుస్తున్నాం.’ అని ఆయన అన్నారు.
Also Read : KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
