మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ రేవంత్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిది బెదిరించడం.. ఎదురించడం బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లు చేసె నైజం అని ఆయన ఆరోపించారు. నిజంగా రేవంత్ రెడ్డికి తలకాయ ఉంటే.. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేస్తే పీసీసీ అధ్యక్షుడుగా ఉండి కనీసం నిరసన కార్యాచరణ ప్రకటించలేనీ అసమర్థుడు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. భూమికి మూరెడు ఉండే రేవంత్ రెడ్డిని, వాళ్ళ పార్టీ వాళ్ళే పీసీసీ హోదా నుండి దించాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అదే నేను పీసీసీ హోదాలో ఉండి ఉంటే రాష్టంలో హల్చల్ సృష్టించే వాన్ని అని ఆయన అన్నారు.
Also Read : Shyam Rangeela: మోడీ గెటప్‌లో హాస్యనటుడు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు
ఇదిలా ఉంటే.. ఈ ఒక్కసారి డోర్నకల్ నుండి నేనే పోటీలో ఉంటా అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు ఉన్నారనే ధైర్యంతో ఈ ఒక్కసారి బరిలో దిగుతా అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మరో సారి డోర్నకల్ బీఆర్ఎస్ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.. రెడ్యా నాయక్ కుటుంబం నుండి టికెట్ పోటీ ఉంది.. ఈసారి రెడ్యా పోటీలో ఉండరు ఆయన స్థానంలో ఆయన వారసులు టికెట్ ఆశిస్తున్నారు అనే ప్రచారానికి రెడ్యా నాయక్ మరోసారి చెక్ పెట్టారు. నేను పోటీలో ఉంటా డోర్నకల్ కార్యకర్తల అండతో ఈ ఒక్కసారి బరిలో నిలుస్తా అని మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు ఆత్మీయ సమావేశం లో ప్రకటించి మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్ పరోక్షణ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రెడ్యా నాయక్.
Also Read : Avinash Reddy : అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా