న్యూ ఇయర్ వేళ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చైనీస్ టెక్ కంపెనీ Xiaomi భారత్ లో Redmi Note 15 5Gని ఆవిష్కరించింది. Redmi Note 15 5G 4K వీడియో సపోర్ట్‌తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. భారత్ లో Redmi Note 15 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 19,999, 8GB RAM, 256GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 21,999 (ప్రారంభ తగ్గింపులతో సహా) నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరికరం సేల్ జనవరి 9న Xiaomi అధికారిక వెబ్‌సైట్, Flipkart, Amazon, ఇతర ఛానెల్‌ల ద్వారా ప్రారంభమవుతుంది.
Also Read:Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి
Redmi Note 15 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Redmi Note 15 5G లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్ అందించారు. గత జనరేషన్ కంటే కంపెనీ CPU, GPU పనితీరులో వరుసగా 30%, 10% బూస్ట్‌ను ప్రకటించింది. Redmi Note 15 5G 6.77-అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ 3,200 nits పీక్ బ్రైట్‌నెస్, 120Hz పీక్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. TUV ట్రిపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్‌తో పాటు వెట్ టచ్‌లకు మద్దతు ఇవ్వడానికి హైడ్రో టచ్ 2.0 టెక్నాలజీతో వస్తుంది. స్క్రీన్ దాని IP66 సర్టిఫికేషన్‌తో డస్ట్ & వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
ఆప్టిక్స్ విభాగంలో, Redmi Note 15 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ ఆప్షన్స్, 4K వీడియోలకు సపోర్ట్ తో కూడిన 108MP హై రిజల్యూషన్ కెమెరాను కలిగి ఉంది. 20MP సెల్ఫీ కెమెరాను అందించారు. Redmi Note 15 5G కి 5,520mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1.6 రోజుల వరకు ఉంటుంది. 7.35 మిమీ మందం, 178 గ్రాముల బరువుతో, రెడ్‌మి నోట్ 15 5G ఇప్పటివరకు అత్యంత సన్నని రెడ్‌మి నోట్ అని కంపెనీ తెలిపింది. Redmi Note 15 5G బ్లాక్, మిస్ట్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ కలర్స్ లో వస్తోంది.