Redmi K60 Ultra 24GB RAM and 256 GB Internal Storage Variant Price and Specs: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఎంఐ’.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను విడదల చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్‌మీ బ్రాండ్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల చేసింది. అదే రెడ్‌మీ కే60 అల్ట్రా (Redmi K60 Ultra). ఈ ఫోన్ విక్రయాలు ఆగష్టు 16న ప్రారంభమయ్యాయి. కేవలం 5 నిమిషాల్లో 2,20,000 యూనిట్లు అమ్ముడుపోయాయి.
Redmi K60 Ultra Launch:
రెడ్‌మీ కే60 అల్ట్రా ఫోన్ 5 వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఇందులో నాలుగు వేరియంట్‌లు ఆగస్టు 16 నుంచి అందుబాటులో ఉన్నాయి. 24GB రామ్, 1TB స్టోరేజ్ వేరియంట్ అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర 3,599 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 42 వేల రూపాయలు). ఈ ఫోన్ వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో (OnePlus Ace 2 Pro)తో పోటీపడుతుంది. 24GB + 1TB వేరియంట్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌ని కలిగి ఉండే వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో ధర 3,999 యువాన్లు (సుమారు 45 వేల రూపాయలు). రెడ్‌మీ కే60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 కంటే మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
Redmi K60 Ultra Specifications:
రెడ్‌మీ కే60 అల్ట్రా ఫోన్ 1220 x 2712 పిక్సెల్‌ల 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.67 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది IP68-రేటెడ్ స్మార్ట్‌ఫోన్. ఇది 8.5mm మందం మరియు 204 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
Also Read: World Cup 2023: ఉప్పల్ మ్యాచ్ రీ షెడ్యూల్.. బీసీసీఐ సమాధానం ఇదే!
Redmi K60 Ultra Camera:
రెడ్‌మీ కే60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 20MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏడు 5000mAh బ్యాటరీలను కలిగి ఉంటుంది.
Redmi K60 Ultra Price:
రెడ్‌మీ కే60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మరిన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్ మరియు 16GB RAM + 1TB స్టోరేజ్ అందుబాటులో ఉంది. వీరి ధర వరుసగా 2,599 యువాన్లు (రూ. 29,664), 2,799 యువాన్లు (రూ. 31,907), 2,999 యువాన్లు (రూ. 34,234) మరియు 3,299 యువాన్లు (రూ. 37,641).