NTV Telugu Site icon

Redmi A5 4G: రూ.10,000లోపే 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ ఫోన్!

Redmi A5

Redmi A5

Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్‌లో కొత్తగా రెడ్‌మీ A5 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్‌లో అధికారికంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్‌ను రూపొందించింది.

Read Also: Moto Book 60 Laptop: 14-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో విడుదలకు సిద్దమైన మోటో బుక్ 60

షియోమి తెలిపిన సమాచారం ప్రకారం.. రెడ్‌మీ A5 ఫోన్ రూ.10,000లోపు ధర విభాగంలో అతి పెద్ద, స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ LCD స్క్రీన్ అందించబడనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 5200mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీని ద్వారా యూజర్లు రోజంతా నిరంతరంగా ఫోన్‌ను వినియోగించవచ్చు. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ ద్వారా వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ పరంగా చూస్తే.. ఇది Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇది మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

Read Also: Moto Pad 60 Pro: 12.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 3K రిజల్యూషన్తో వచ్చేస్తున్న మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్

ఇక కెమెరా, ఇతర ఫీచర్లను చూసినట్లయితే.. ఈ ఫోన్ వెనుక భాగంలో 32MP రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో భారీ కెమెరా మాడ్యూల్‌గా నిలుస్తుంది. సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది అన్‌లాక్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కోసం 8MP కెమెరా ఉంటుంది. ఇది సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్‌కు అనువుగా ఉంటుంది. రెడ్‌మీ A5 ఫోన్‌ ను జైసల్మేర్ గోల్డ్, పుదుచ్చేరి బ్లూ, జస్ట్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో అందించనున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, mi వెబ్ సైట్, ఆఫ్లైన్ స్టోర్స్ లో లభించనుంది.