Redmi A4 5G Price: క్రేజీ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ.. 10 వేలకే రెడ్‌మీ 5జీ ఫోన్‌! ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే

  • రెడ్‌మీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్
  • 10 వేలకే రెడ్‌మీ ఏ4 5జీ
  • ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే
Redmi A4 5g Launch

Redmi A4 5g Launch

Redmi A4 5G Launch and Price in India: చైనీస్‌ మొబైల్ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ ‘రెడ్‌మీ’.. సామాన్యులకు అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తుంటుంది. మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్ రెడ్‌మీ ఫోన్‌లే. అందుకే రెడ్‌మీ నుంచి ఏ ఫోన్ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అతి తక్కువ ధరలో ఇప్పటికే ఎన్నో ఫోన్‌లను తీసుకొచ్చిన రెడ్‌మీ.. తాజాగా తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ‘రెడ్‌మీ ఏ4’ 5జీ పేరుతో ఫోన్‌ను వదిలింది.

రెడ్‌మీ ఏ4 5జీని ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2024లో రెడ్‌మీ ప్రదర్శించింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. 4 జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఈ మొబైల్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే రూ.10 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. స్నాప్‌డ్రాన్‌ 4ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ మార్కెట్లో వస్తున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే అని కంపెనీ చెబుతోంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఉంటుంది.

Also Read: Infinix Zero Flip Price: ‘ఇన్‌ఫినిక్స్‌’ నుంచి తొలి ఫ్లిప్‌ ఫోన్‌.. 50 వేలకే సూపర్ కెమెరా, బిగ్ బ్యాటరీ!

రెడ్‌మీ ఏ4 స్మార్ట్‌ఫోన్‌లో 6.25 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా ఉండనుంది. సెకండరీ కెమెరా కూడా ఉంది. 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఎప్పటి నుంచి ఉంటుందో కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు.