NTV Telugu Site icon

AUS vs AFG: వరల్డ్ కప్లో రికార్డు.. ఒంటిచేతితో గెలిపించిన మ్యాక్సీ

Maxwell

Maxwell

వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాక్సీ.. ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి వరల్డ్ కప్ లో రికార్డు సృష్టించాడు.

Telangana Assembly Elections 2023: 8 స్థానాల్లో బరిలోకి జనసేన.. అభ్యర్థులు వీరే

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్ సెంచరీ చేసినప్పటికీ వృధా అయింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో గుర్బాజ్ 21, రహ్మత్ 30, షాహిది 26, అజ్మతుల్లా 22, రహీద్ ఖాన్ 35, నబీ 12 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ ఉడ్ 2 వికెట్లు తీయగా.. స్టార్క్, మ్యాక్స్ వెల్, జంపా తలో వికెట్ పడగొట్టారు.

Manchu Manoj: హనుమాన్ ఆశీర్వాదంతో షో స్టార్ట్ చేసిన మంచు మనోజ్

ఇక ఆ తర్వాత 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 18, ట్రేవిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ 24, లంబుషేన్ 14, జోష్ ఇంగ్లిస్ డకౌట్, గ్లేన్ మ్యాక్స్ వెల్ 201, మార్కస్ స్టోయినీస్ 6, మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 12 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్, ఒమర్జాయ్, రషీద్ ఖాన్ కు తలో రెండు వికెట్లు దక్కాయి.