వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.