NTV Telugu Site icon

Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భార‌త మార్కెట్‌లోకి రియల్‌మీ 12 సిరీస్!

Realme 12

Realme 12

Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భార‌త మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్ర‌వేశ‌పెట్టిన రియల్‌మీ 11 సిరీస్‌కు కొన‌సాగింపుగా రియల్‌మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ ఇప్పటికే స‌న్నాహాలు చేప‌ట్టింది. 12 సిరీస్‌కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గ‌తంలో పెరిస్కోప్ లెన్స్ కేవ‌లం మ‌ధ్య‌శ్రేణి స్మార్ట్‌ఫోన్ల‌కే ప‌రిమితం కాగా.. ఇప్పుడు 12 సిరీస్‌లో ఈ ఫీచ‌ర్‌ను జోడించ‌డం ఆస‌క్తి రేపుతోంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో సిరీస్ మరియు ఇతర స్మార్ట్‌ఫోన్‌లను రియల్‌మీ లక్ష్యంగా పెట్టుకుంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఇటీవల భారతీయ మార్కెట్లో 200MP కెమెరాతో వచ్చాయి. దాంతో 200MP కెమెరాను రియల్‌మీ..12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో అందిస్తోంది. 12 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 12, రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో ప్లస్ మోడ‌ల్స్‌ను కంపెనీ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. పెరిస్కోప్ లెన్స్‌ను రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో ప్లస్ మోడల్స్‌లో అందించనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 1, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగ‌న్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ చిప్‌సెట్స్‌ను క‌లిగి ఉండనున్నాయి.

Also Read: Lalit Modi: ఆర్‌సీబీ తరఫున ఆడకుంటే.. కెరీర్‌ ముగించేస్తానని మోడీ బెదిరించాడు: టీమిండియా మాజీ పేసర్‌

120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్ (2412-1080 పిక్సెల్‌లు)తో 6.7 ఇంచెస్ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను రియల్‌మీ 12 సిరీస్ కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. రియల్‌మీ 12 ప్రో ప్లస్ మోడల్స్‌ 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని అంచనా. రియల్‌మీ 12 ప్రో మోడల్స్‌ 2x జూమ్‌తో 32MP పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఈ రెండు మోడళ్లలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. 168MP ఫ్రంట్ కెమెరా, 5000 బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది. రియల్‌మీ 12 సిరీస్ ఫాన్స్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ, ధర లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.