Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భారత మార్కెట్లోకి రియల్మీ 12 సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్మీ 11 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. 12 సిరీస్‌కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గతంలో పెరిస్కోప్ లెన్స్ కేవలం మధ్యశ్రేణి స్మార్ట్ఫోన్లకే పరిమితం కాగా.. ఇప్పుడు 12 సిరీస్‌లో ఈ ఫీచర్‌ను జోడించడం ఆసక్తి రేపుతోంది.
రెడ్మీ నోట్ 13 ప్రో సిరీస్ మరియు ఇతర స్మార్ట్ఫోన్లను రియల్మీ లక్ష్యంగా పెట్టుకుంది. రెడ్మీ నోట్ 13 ప్రో ఇటీవల భారతీయ మార్కెట్లో 200MP కెమెరాతో వచ్చాయి. దాంతో 200MP కెమెరాను రియల్మీ..12 సిరీస్ స్మార్ట్ఫోన్లలో అందిస్తోంది. 12 సిరీస్‌లో భాగంగా రియల్మీ 12, రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో ప్లస్ మోడల్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. పెరిస్కోప్ లెన్స్‌ను రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో ప్లస్ మోడల్స్‌లో అందించనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ చిప్సెట్స్ను కలిగి ఉండనున్నాయి.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
Also Read: Lalit Modi: ఆర్సీబీ తరఫున ఆడకుంటే.. కెరీర్ ముగించేస్తానని మోడీ బెదిరించాడు: టీమిండియా మాజీ పేసర్
120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ (2412-1080 పిక్సెల్‌లు)తో 6.7 ఇంచెస్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను రియల్మీ 12 సిరీస్ కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. రియల్మీ 12 ప్రో ప్లస్ మోడల్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని అంచనా. రియల్మీ 12 ప్రో మోడల్స్ 2x జూమ్‌తో 32MP పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఈ రెండు మోడళ్లలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. 168MP ఫ్రంట్ కెమెరా, 5000 బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది. రియల్మీ 12 సిరీస్ ఫాన్స్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సేల్కు అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ, ధర లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!