Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Real Estate Boom In Pithapuram After Deputy Cm Pawan Kalyan Statment

Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్‌ ప్రకటన.. రియల్ భూమ్ @ పిఠాపురం..!

Published Date :July 6, 2024 , 11:03 am
By Sudhakar Ravula
  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటన..
  • పిఠాపురంలో రియల్‌ భూమ్‌..!
  • పిఠాపురం.. పరిసర ప్రాంతాలపై దృష్టిపెట్టిన రియల్టర్లు..!
  • భూమి కొన్నానంటూ పవన్‌ ప్రకటించడంతో.. ఒక్కసారిగా పెరిగిన భూముల ధర..!
Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్‌ ప్రకటన.. రియల్ భూమ్ @ పిఠాపురం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు రియల్‌ భూమ్‌ నడుస్తోందట.. దానికి ప్రధాన కారణం జనసేనాని పవన్‌ ప్రకటనే అంటున్నారు స్థానికులు.. పిఠాపురం నుంచి బరిలోకి దిగి.. భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు పవన్‌ కల్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసార తన సొంత నియోజకవర్గంతో పాటు.. కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు.. దీనికి రియల్‌ భూమ్‌కి కారణం ఏంటి? అంటారా? విషయం ఏంటంటే.. పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు పవన్.. 3.52 ఎకరాల భూమి కొన్నట్లు స్వయంగా పవన్‌ కల్యాణే ప్రకటించారు.. రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం, మిగతా స్థలంలో ఇల్లు కడతానని బహిరంగ వెల్లడించారు.. మరో 16 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన పవన్‌.. దానికి రైతులతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని.. వచ్చే పర్యటనలో రిజిస్ట్రేషన్ కి అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..

ఇక, ఏ అవకాశాన్ని వదులుకోని రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు రంగ ప్రవేశం చేశారట.. పవన్ భూములు ఉన్న ప్రాంతాల్లో స్థలాలు కొనే వేటలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు పడిపోయారట.. డిప్యూటీ సీఎం భూములు ఎక్కడ ఉన్నాయి, చుట్టూ పక్కల అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటూ ఆరా తీస్తున్నారట.. ఇతర ప్రాంతాలకి చెందినవారు.. ఎప్పుడూ లేని విధంగా తమకు ఫోన్ లు చేసి భూములు రేట్లు అడుగుతున్నారని మధ్యవర్తులు చెబుతున్నమాట.. పిఠాపురం టౌన్ లో రోడ్డు ప్రక్కన భూముల ధర భారీగా ఉందట.. ఎకరం భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతుండగా.. భూమి లోపలకి ఉంటే రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోందని చెబుతున్నారు.. అయితే, ఇదంతా ఇప్పుడు పెరిగిన ధరేనట.. ఎందుకంటే..? ఇంతకు ముందు రూ.50 లక్షల నుంచి కోటి. 25 లక్షల రూపాయలు దాటలేదని స్థానికులు చెబుతున్నారు.. జాతీయ రహదారి 216కి సమీపంలో ఉన్న భూములు ఎకరం రూ.3 కోట్లు, లోపలకి ఉన్నవి రూ. కోటిన్నర వరకు చెబుతున్నారట.. గతంలో నేషనల్ హై వే పై కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ధర పలికిందంటున్నారు..

Read Also: Hot Water Drinking : గోరువెచ్చని నీరు తాగడంవల్ల నిజంగా బరువును తగ్గవచ్చా.. అసలు నిజమేంటంటే..

మరోవైపు.. లేఅవుట్ లలో స్థలాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది అంటున్నారు రియల్టర్లు.. అగ్రిమెంట్లు తర్వాత అడ్వాన్సులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి పార్టీలు.. వారం రోజుల్లోనే రెట్టింపు ధర పలుకుతోందట గజం భూమి ధర.. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అడ్వాన్స్ అవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. అందినకాడికి భూమి కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.. అధిక లాభాలు వస్తాయని పదిమంది చిన్న సన్నకారు రైతులు దగ్గర భూములు కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నారట.. వరదలు వస్తే ఈ ప్రాంతం ముంపుకి గురవడంతో ఇప్పటి వరకు పెద్దగా లేని డిమాండ్, పవన్ కల్యాణ్‌ భూములు ఉన్నాయి కాబట్టి ముంపుకు శాశ్వత పరిష్కారం వస్తుందని స్థానిక రైతులు ఆశిస్తున్నారు.. మొత్తంగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో.. పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాననే ప్రకటనతో రియల్ భూమ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా పిఠాపురం మారిపోయిందని చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Deputy CM Pawan Kalyan
  • janasena
  • pithapuram
  • Real Boom in Pithapuram

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions