IPL 2025:’ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
- ఆర్సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా
- మహిళ ఫోటో సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ టైటిల్ కు అడుగు దూరంలో ఉంది ఆర్సీబీ. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సారి కప్పు మాదే అంటూ సంబరపడిపోతున్నారు. అయితే నిన్న మ్యాచ్ సందర్భంగా ఓ మహిళ చేతిలో పెద్ద బ్యానర్ పట్టుకుని కనిపించింది. దానిపై బోల్డ్ అక్షరాలతో ఆర్సిబి ఫైనల్ గెలవకపోతే, నేను నా భర్తకు విడాకులు ఇస్తాను అని రాసి ఉంది. ఈ ఫన్నీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
Also Read
- Naseeruddin Shah: 'నేను దిమాగీ నక్సల్‌నే'.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
- El Nino: భారత్‌పై "ఎల్ నినో" పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
- Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
ఈ వింత పోస్టర్‌తో పెవిలియన్‌లో నిలబడి ఉన్న మహిళ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళకు తన జట్టుపై ఉన్న నమ్మకం, అభిమానం గురించి, ఆమె ఎందుకు అంత పెద్ద రిస్క్ తీసుకుంటుందనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి. 2016 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. దీని కారణంగా ఆ జట్టు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మే 29న పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత, అభిమానుల కోసం ఆర్సిబి టైటిల్ గెలవాలని ప్రార్థనలు చేస్తు్న్నారు.
Also Read:Salman Khurshid: ‘‘ప్రధాన సమస్య ముగిసింది’’.. ఆర్టికల్ 370 రద్దును ప్రశంసించిన కాంగ్రెస్ నేత..
మే 29న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, ఎరుపు రంగు చీర ధరించిన ఒక మహిళా అభిమాని మ్యాచ్ కే ఆకర్షణగా నిలిచింది. RCB అభిమాని అయిన ఈ మహిళ పసుపు రంగు బ్యానర్‌పై ఇలా రాసింది- RCB ఫైనల్ గెలవకపోతే, నేను నా భర్తకు విడాకులు ఇస్తాను. కింద @chiraiya_ho అని రాసి ఉంది. దానితో పాటు #KingKohli అని కూడా రాసి ఉంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి మనం ఓడిపోతే, మీ వల్ల ఒక జంట విడిపోతది అంటూ కామెంట్ చేస్తున్నారు.
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 29, 2025
తాజావార్తలు
-
Naseeruddin Shah: ‘నేను దిమాగీ నక్సల్‌నే’.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..