Site icon NTV Telugu

Ram Charan Birthday: మెగా అభిమానులకు అలర్ట్‌.. RC15 టైటిల్‌ రివీల్‌

Game Changer

Game Changer

మెగా అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RC15. రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులు చాలా నెలలుగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు వచ్చింది. మావెరిక్ దర్శకుడు శంకర్ షణ్ముగంతో గ్లోబల్ స్టార్ ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆర్‌సి 15 నిర్మాతలు ఈ చిత్రానికి అధికారికంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)అని పేరు పెట్టారు. అలాగే సినిమాకు కాన్సెప్ట్ కు సంబంధించిన పవర్‌ఫుల్‌ వీడియోను కూడా విడుదల చేశారు.

పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్‌తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్ మేక, అంజలి, నవీన్ చంద్ర మరియు ఇతరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత సంచలనం తమన్ గేమ్ ఛేంజర్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 03:06 గంటలకు విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు.

Exit mobile version