RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’పై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా ఖరారు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, దసరా సందర్భంగా లేదా అక్టోబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్గా పూర్తయ్యాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొత్త ఆఫీసులో మేకర్స్ లాంఛనంగా సినిమా ప్రారంభోత్సవం చేసేశారని వార్తలు గుప్పుమన్నాయి. కానీ, అసలు నిజం వేరే ఉంది.
తాజా సమాచారం ప్రకారం అక్కడ జరిగింది సినిమా ఓపెనింగ్ పూజ కాదని, కేవలం ఈ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన నూతన కార్యాలయ (ఆఫీస్) ప్రారంభోత్సవం మాత్రమేనని స్పష్టమైంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం సుకుమార్ టీమ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా గ్రాండ్ ఓపెనింగ్, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలపై మూవీ టీమ్ త్వరలోనే అధికారికంగా స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతానికైతే వైరల్ అవుతున్నట్లుగా సినిమా లాంఛింగ్ పూజ జరగలేదని, జరిగింది కేవలం ఆఫీస్ పూజ మాత్రమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
తాజావార్తలు
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!