బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారడానికి ‘సూత్రప్రాయంగా’ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 3, 2024న, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా స్వచ్ఛందంగా మారడానికి RBIకి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దేశంలో పనిచేస్తున్న 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో అతిపెద్దదైన AU బ్యాంక్ గురువారం `సూత్రప్రాయంగా’ ఆమోదం పొందింది.
Also Read:Off The Record: బీసీ రిజర్వేషన్ అంశం బీఆర్ఎస్‌కు ఇరకాటంగా మారిందా?
ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకు యూనివర్సల్ బ్యాంకుగా మారడానికి అర్హత ప్రమాణాలు ఏమిటంటే.. అది కనీసం ఐదు సంవత్సరాలు ఆర్బీఐ నిబంధనలకు లోబడి సంతృప్తికరమైన పనితీరు రికార్డును కలిగి ఉండాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయబడి ఉండాలి. కనీసం రూ. 1,000 కోట్ల నికర విలువను కలిగి ఉండాలి. అలాగే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అర్హత ప్రమాణం ఏమిటంటే, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో GNPA, NNPA వరుసగా 3 శాతం, 1 శాతం కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (AU SFB) ఒక షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు. ఏప్రిల్ 2017లో తన బ్యాంకింగ్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి భారతదేశపు అతిపెద్ద, చిన్న ఫైనాన్స్ బ్యాంకుగా స్థిరపడింది. దీనిని 1996లో సంజయ్ అగర్వాల్ స్థాపించారు. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, MD & CEO సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, “యూనివర్సల్ బ్యాంక్‌గా రూపాంతరం చెందడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందడం ద్వారా మేము చరిత్ర సృష్టించామన్నారు.