సరికొత్త కథతో రూపోందుతున్న సినిమా రజాకార్…తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా పోస్టర్ తాజాగా విడుదల చేశారు.. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా ఈ సినిమాను ఆపేయ్యాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయ్యాయి. సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రజాకార్ సినిమాపై అభ్యంతరం ఉంటే నిపుణుల కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటీషనర్‌కు సూచించింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది..
ఈ పిటిషన్ ను కొట్టివేసింది.. ఈ సినిమాను గూడురు నారాయణరెడ్డి నిర్మించగా.. ఈ నెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే రజాకార్ మూవీ విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కమిటీ పిటిషన్ ను కొట్టిపారేసింది.. సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. అనుకున్న టైం కే విడుదల కాబోతుంది..