NTV Telugu Site icon

Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా…

Land Grab Raidurg

Land Grab Raidurg

Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో అధికారి భూ దందా వెలుగులోకి వచ్చింది. దీంతో సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. 12.09 ఎకరాల లెదర్ పార్క్ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నారు. రాయదుర్గం పరిధిలోని లేదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ కి చెందిన 12.09 ఎకరాల భూమి ఆక్రమణ గురైంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు కబ్జాకోరులకు సహకరించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి 600 కోట్ల రూపాయల విలువైన భూమి పెట్టారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో.. కబ్జా కి పాల్పడిన ఆరుగురు వ్యక్తులతోపాటు.. రంగారెడ్డి జిల్లా బాలానగర్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. కబ్జాకి ప్రయత్నించిన మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్, మహ్మద్‌ అబ్దుల్‌ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా ను సైతం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..

ఈ సందర్భంగా NTVతో EOW DCP ప్రసాద్ మాట్లాడుతూ.. రాయదుర్గం పరిధిలోని 600 కోట్ల విలువైన 12.09 ఎకరాల్లో గృహ, వాణిజ్య సముదాయ నిర్మాణం చేపట్టేందుకు గ్రీక్‌ బిల్డర్స్‌ ఎల్‌ఎల్‌పీ నవీన్‌కుమార్‌ గోయల్‌తో మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్, మహ్మద్‌ అబ్దుల్‌ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 39 బహుళ అంతస్తుల నిర్మాణం అభివృద్ధి చేసేందుకు 30:70 రేషియో లో ఒప్పందం జరిగిందని, నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న ఈ భూములను కొట్టేసేందుకు పెద్ద పథకమే వేశారన్నారు. నకిలీ పత్రాలు సృష్టించారని, ఫైజుల్లా వారసులుగా మహ్మద్‌ అబ్దుల్‌ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా పేరిట ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారన్నారు. నకిలీ పత్రాలతో ఫైజుల్లా వారుసులు, గ్రీక్‌ బిల్డర్స్‌ ఎల్‌ఎల్‌పీ మధ్య ‘డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ గురుసాయిరాజ్‌ సహకరించాడని, ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసినా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చాడన్నారు. రాయదుర్గం 1,4,5,20 సర్వే నంబర్లలోని ఈ ప్రభుత్వ భూములు తెలంగాణ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఆధీనంలో ఉన్నాయని, 5.16 ఎకరాల్లో యూనిటీ మాల్‌ నిర్మాణం చేపట్టేందుకు టీఎస్‌ఎల్‌ఐపీసీవోతో తెలంగాణ స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లీజు అగ్రిమెంట్‌ చేసుకుందన్నారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం గుర్తించిన శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వెంకారెడ్డి సైబరాబాద్ EOW లో ఫిర్యాదు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని, మరికొందరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.

Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..