NTV Telugu Site icon

ICC Test Rankings: అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

Icc Test Rankings

Icc Test Rankings

ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు. ఇక టీమిండియా తరుఫున యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉండగా., రిషబ్ పంత్ 9వ స్థానంలో ఉన్నారు. రూట్ ఈ ఏడాది జూలైలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను అధిగమించి తొమ్మిదవసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హ్యారీ బ్రూక్ టెస్ట్ క్రికెట్లో నిలకడగా మంచి ప్రదర్శన కనబరిచాడు. 23 టెస్టుల్లో బ్రూక్ 61.62 సగటుతో 2280 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మన్ బ్రూక్ 2024లో 11 టెస్ట్ మ్యాచ్ లలో నాలుగు సెంచరీలతో సహా 1099 పరుగులు చేశాడు. బ్రూక్ సెప్టెంబర్ 2022లో ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు.

Also Read: live-in relationship: “కలిసి జీవిస్తే, పోలీసులు రక్షణ ఎందుకు..?” మతాంతర జంటపై కోర్టు ఆగ్రహం..

టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (856), ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ (851) ఉన్నారు. ఇక టీమిండియా నుండి సీనియర్ ప్లేయర్స్ రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో 5వ స్థానంలో, రవీంద్ర జడేజా 786 పాయింట్లతో 6వ స్థానంలో టాప్ 10లో కొనసాగుతున్నారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 415 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహెదీ హసన్ మిరాజ్ 285 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 283 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు.