NTV Telugu Site icon

Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన

Aswin

Aswin

Ravichandran Ashwin: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు కష్టకాలంలో ఉంది. ఆసియా కప్ 2023 నుంచి జట్టు ఒక్కో విజయం కోసం తెగ పోరాడుతుంది. 2023 ప్రపంచ కప్‌లో జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోకపోవడం, ఇక 2024 T20 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్ నుండి నిష్క్రమన., ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమి, కెప్టెన్సీని తరచూ మార్చడం వంటి కారణాలతో జట్టులో అస్థిరత వాతావరణం నెలకొంది. ఈ విషయంపై తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత బాబర్ ఆజం జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ పరాజయాలు పాకిస్థాన్ అభిమానులను నిరాశపరిచాయి. అలాగే పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత కలహాలు కూడా ఉన్నాయి. కెప్టెన్సీలో తరచూ మార్పులు చేయడం వల్ల జట్టులో గందరగోళం ఏర్పడిందని, ఆటగాళ్లు జట్టు విజయం కంటే తమ వ్యక్తిగత ఆటలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని భారత జట్టు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి పర్యటన

ఈ విషయంపై అశ్విన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుత పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న దశను చూస్తుంటే నేను చాలా బాధగా ఉన్నానని తెలిపాడు. చాలా మంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు పాకిస్థాన్ తరపున ఆడారు. పాకిస్థాన్ చాలా మంచి జట్టు. క్రికెటర్ల కోణంలో చూస్తే.. క్రికెట్‌ ఆడేందుకు గర్వపడే దేశం. త‌ర‌చుగా సార‌థుల‌ను మార్చ‌డం వల్ల అక్కడ అయోమ‌యం నెల‌కొంద‌న్నాడు. ఇప్పటి నుంచైనా ప్లేయ‌ర్లు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న పై దృష్టి సారించాల‌ని అశ్విన్ అన్నాడు. ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్ దేశ క్రికెట్ ప్ర‌స్తుత ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌న్నాడు. ఇక టీం ప‌రిస్థితి చూస్తుంటే జాలివేస్తోందని., ఒకవేళ అక్క‌డ నైపుణ్య‌ ఆట‌గాళ్ల‌కు ఏదైనా కొద‌వ ఉందా అంటే అలాంటింది ఏం లేదని., చాలా మంచి ప్లేయ‌ర్లు అందుబాటులో ఉన్నారని తెలిపాడు. కాకపోతే.. వారి క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌ల‌ నేపథ్యంలో ఆ జ‌ట్టు ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుందని., ముఖ్యంగా కుర్చీలాట‌తో మ‌రింత దిగ‌జారుతోందని అంటూ.. ఆ జట్టు దాదాపు 1000 రోజులుగా మ్యాచ్ గెల‌వ‌లేదంటే స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చని అశ్విన్ మాట్లాడాడు.