మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఒక సినిమా ఉండగానే మరో సినిమా లైనప్ లో పెడుతున్నాడు..ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేశారో లేదో.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా ఏదో కాదు, హిందీ సినిమా రీమేక్. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఈ రీమేక్‌ను రూపొందించనున్నారు..
పీపుల్ మీడియా బ్యానర్‌పై రవితేజ..ధమాకా సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మాస్ మహారాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇదే బ్యానర్‌లో సినిమా చేయటానికి ఈ స్టార్ హీరో రెడీ అయిపోయారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శత్వంలో మూవీ చేస్తున్న మాస్ రాజా దాన్ని పూర్తి చేసిన తర్వాత రైడ్ మూవీ రీమేక్‌ను స్టార్ట్ చేస్తారని టాక్..ఇకపోతే ఈ రీమేక్ వచ్చే ఏడాది జనవరిలో షురూ చేస్తారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాను హరీష్ శంకర్ రూపొందించబోతున్నారు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత హరీష్, రవితేజ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం రవితేజ గతంలో చేసిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నారు..దీంతో ఈ సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాటు ఈగల్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయటంలో బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు ఈ ఏడాది దసరాకు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈగల్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది.. ఆ తర్వాత వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారని సమాచారం..