Site icon NTV Telugu

Ravi Shastri: ఆల్‌టైమ్‌ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు.. ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేకు నో ప్లేస్!

Ravi Shastri

Ravi Shastri

Ravi Shastri All-Time Top-5 Indian Cricketers: ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్స్ మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్‌లతో కలిసి ‘ది ఓవర్‌లాప్’ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆల్‌టైమ్ టాప్‌-5 ఇండియా క్రికెటర్లు ఎంచుకోవాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్స్ కోరగా.. రవిశాస్త్రి టక్కున సమాధానం ఇచ్చారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తన ఆల్‌టైమ్‌ గ్రేట్ అని పేర్కొన్నారు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లేలను రవిశాస్త్రి ఎంచుకోకపోవడం విశేషం.

ఐదుగురిలో నంబర్ వన్ ఎవరు? అని అలిస్టర్ కుక్ అడగ్గా.. సునీల్ గవాస్కర్ అని రవిశాస్త్రి బదులిచ్చారు. ‘ఐదుగురిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ‘బ్యాటింగ్‌ పరంగా సన్నీ టాప్. కపిల్ దేవ్ అద్భుతమైన ఆటగాడు. అన్ని కోణాల్లో చూస్తే సచిన్ టెండూల్కర్ నంబర్‌ వన్ ప్లేయర్. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. అతడి తరంలో ప్రతి ఒక్క పేస్‌ బౌలింగ్‌ అటాక్‌ను ఎదుర్కొని 100 సెంచరీలు బాదాడు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు జాక్వెస్ కలిస్, షాన్ పొలాక్‌, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ వంటి టాప్ పేసర్లను అలవోకగా ఆడాడు. నా లిస్టులో బిషన్ సింగ్ బేడి ఉన్నాడు కానీ ఎంఎస్ ధోనీని ఎంచుకున్నా. జస్ప్రీత్ బుమ్రా ఇంకా క్రికెట్‌లో ఉన్నాడు కాబట్టి ఎంచుకోలేను’ అని రవిశాస్త్రి సమాధానమిచ్చాడు.

రవిశాస్త్రి ఆల్‌టైమ్‌ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు:
# సునీల్ గవాస్కర్
# కపిల్ దేవ్
#సచిన్ టెండూల్కర్
# ఎంఎస్ ధోనీ
# విరాట్ కోహ్లీ

Exit mobile version