Vishal : ‘రత్నం’ షూటింగ్ పూర్తి.. ‘డిటెక్టివ్ 2’ పై ఫోకస్ పెట్టిన విశాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గత ఏడాది ‘మార్క్ ఆంటోనీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ప్రస్తుతం ‘రత్నం’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు విశాల్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్షన్ ప్రియులందరికీ పండుగలా ఉంటుందని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు విశాల్ తెలిపారు.”రత్నం షూటింగ్ మొత్తం పూర్తయింది. దర్శకుడు హరి సర్ తో, డార్లింగ్ డిఓపి సుకుమార్ అండ్ మొత్తం యూనిట్ తో కలిసి మూడవసారి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. టుటికోరిన్, తిరుచ్చి, కారైకుడి, వెల్లూరు, తిరుపతి మరియు చెన్నై వంటి ప్రాంతాల్లో పూర్తి సానుకూల వాతావరణంలో పని చేయడం నాకొక మంచి జ్ఞాపకం. స్టోన్ బెంచర్స్ నిర్మాత కార్తీక్ అండ్ టీమ్ కి కృతజ్ఞతలు. డార్లింగ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అద్భుతమైన పాటలను విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది యాక్షన్ ప్రియులందరికీ పెద్ద పండుగలా ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తూనే మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది సమ్మర్ ట్రీట్ కావచ్చు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. థాంక్యూ” అని విశాల్ ట్వీట్ చేసారు..
ఈ సందర్భంగా డైరెక్టర్ హరి, సినిమాటోగ్రాఫర్ ఎమ్. సుకుమార్ లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2024 సమ్మర్ లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ‘రత్నం’ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”డిటెక్టివ్ 2” మూవీ మీద విశాల్ ఫోకస్ పెట్టారు. ట్విట్టర్ డీపీ చేంజ్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేసారు. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ‘డిటెక్టివ్’ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే దర్శక హీరోల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా డైరెక్టర్ ను తొలగించి, సీక్వెల్ కు విశాల్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
Also Read
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
Yes yes yes. Done with entire shoot of #Rathnam. Was an absolute pleasure to work with Dir Hari sir for the third time, with darling DOP @mynnasukumar and the entire unit. Always a memory for life working in such a positive atmosphere all through the shoot right from Tuticorin,… pic.twitter.com/TJzRg9skFb
— Vishal (@VishalKOfficial) January 23, 2024
తాజావార్తలు
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!