Site icon NTV Telugu

Rashmika : బ్రేక్ తీసుకున్న రష్మిక మందన్న.. పోస్ట్ వైరల్

Rashmika

Rashmika

వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తాజాగా తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. కేవలం రెండు రోజుల సెలవు దొరకడం తో, తన బెస్ట్ ఫ్రెండ్స్ మరియు నటి వర్షా బొల్లమ్మతో కలిసి శ్రీలంక వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ అందమైన ప్రకృతి ఒడిలో గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఈ రెండు రోజులు నాకు చాలా స్పెషల్, ఈ మూమెంట్స్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. పుష్ప-2 ఘనవిజయం తర్వాత ఛావా, కుబేర, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, మైండ్ రీఫ్రెష్ చేసుకోవడానికి ఇలా వెకేషన్‌ను ప్లాన్ చేసుకున్నారని ఆమె పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ఇక..

Also Read : Vishwambhara : ఎట్టకేలకు ‘విశ్వంభర’ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ !

సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ రష్మిక వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై రష్మిక పరోక్షంగా స్పందించినప్పటికీ, విజయ్ దేవరకొండ మాత్రం ఇప్పటివరకు మౌనంగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ కూడా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో, వీరిద్దరి పెళ్లి ముచ్చట ఎప్పుడు అధికారికంగా బయటకు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక ప్రస్తుతం ‘మైసా’, ‘రెయిన్బో’ వంటి చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

 

Exit mobile version