Rashmika: రష్మిక మందన్నా ఈ మధ్య కాలంలో సంచలనంగా మారింది. అమ్మడు సినిమాల విషయంలో కాకుండా తాను చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లోకి ఎక్కింది. తన మాతృభాష అయిన కన్నడ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకుంది. దీంతో అక్కడి వారు రష్మికంటే అంతెత్తుకు ఎగురుతున్నారు. సక్సెస్ రాగానే కళ్లు నెత్తికెక్కాయంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆమెను బ్యాన్ చేశామంటూ ట్వీట్ చేస్తున్నారు. కన్నడ కిర్రాక్ పార్టీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ సినిమా తర్వాత తెలుగులో ఛలో, గీతాగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు హిట్స్‌తో కెరీర్ లో దూసుకుపోయారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకున్నారు. ఇకపోతే కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్ అందుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీని చులకన చేసిందంటూ నెట్టింట ఇటీవల తెగ ట్రోలింగ్ జరుగుతోంది.
Read Also: VeeraSimha Reddy :శివాలెత్తిస్తోన్న ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సింగిల్!
అసలు కారణం ఏంటంటే..
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘కాంతార’. అయితే ఇంతవరకూ ఈ సినిమా చూడనేలేదని, అంత టైం లేదని చెప్పిందీ ఈ భామ. అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి చెప్పేటప్పుడు సోకాల్డ్ బ్యానర్‌లో చేశానంటూ నిర్మాణ సంస్థ పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఇది కన్నడిగులకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ సినిమా బ్యానర్ కూడా తెలీదా? సో కాల్డ్ బ్యానర్ అని యాక్ట్ చేసి చెప్పడం ఎందుకు? అంత యాటిట్యూడ్ అవసరమా? అంటూ కన్నడిగులు మండిపడ్డారు. అటు కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం రష్మికపై పరోక్షంగా కామెంట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీలో రష్మికను బ్యాన్ చేయనున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Ashok Hotel: త్వరపడండి.. అమ్మకానికి చారిత్రాత్మక అశోకా హోటల్
#RashmikaMandanna officially “ BANNED ” in Kannada Movies due to disrespect Kannada movies !!!
— Umair Sandhu (@UmairSandu) November 24, 2022