Rashi Khanna: నా కంఫర్ట్ జోన్ దాటి దిగజారిపోయే పాత్రలు నాకొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్‌లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించిన గ్లామరస్ స్టార్ రాశీ ఖన్నా, ఇప్పుడు తన కెరీర్ దిశను మార్చుకునేందుకు సిద్ధమైందని చెబుతోంది. నటనకు ప్రాధాన్యమున్న, కథ బలం గల పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన ‘120 బహాదుర్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశీ, పాత్రల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read : Savitri : మహానటి 90వ జయంతి సందర్భంగా .. సావిత్రి మహోత్సవం
Also Read
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
- రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
- 10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
“దక్షిణాదిలో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. వాటితో నాకు గుర్తింపు వచ్చింది, ప్రేక్షకుల ప్రేమ దక్కింది. కానీ ఇకపై హిందీలో మరింత కథా ప్రాధాన్యమున్న, నటనను పరీక్షించే పాత్రలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. వాణిజ్య చిత్రాలు చేయడం ఇష్టమే కానీ ప్రతి విషయం కి ఒక హద్దు ఉంటుంది” అని రాశీ తెలిపింది.
తన వ్యక్తిగత కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతూ..“నేను ఎంచుకునే పాత్రలో నాకే కంఫర్ట్‌గా ఉండాలి. కొన్నిసార్లు పాత్రలు నా లిమిట్ దాటి వెళ్లేలా ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి సందేహం లేకుండా నో చెప్పేస్తాను. ఆ పాత్రలో నేను దిగజారిపోయేలా కనిపిస్తానని అనిపించినా కూడా ఒప్పుకోను. ప్రతి నటికి తనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. దానిని గౌరవించడం తప్పు కాదు. నేను ఇతరులను జడ్జ్ చేయను, కానీ నాకు నచ్చని ఎంపికలను మాత్రం నేను చేయను” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాశీ ఖన్నా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తో పాటు పలు తెలుగు, హిందీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది. తన కెరీర్లో కొత్త దశను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ఆమె, కంటెంట్ ఆధారిత పాత్రలతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యం పెట్టుకుంది.
తాజావార్తలు
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
-
AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!