కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు నిధులు నియామకాలు అనే గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఅర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతుబందు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని, రైతుబంధు కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఅర్ 7వేల కోట్లు ఉంచారన్నారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చారని, గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం నిష్పక్షపాతంగా జిల్లా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1500 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందించామని ఆయన వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యక్తి కేసీఅర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. దళిత బంధు కు ఎంపికైన 1100 మంది లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి అకౌంట్ లలో ఇప్పటికే గ్రాంట్ ను వేయడం జరిగిందని, కాళేశ్వరం జలాలతో నియోజకవర్గంలోని అరు మండలాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీళ్ళు ఇవ్వలేక చేతకాని తనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ చేయాల్సిన పనులు వదిలిపెట్టి 31st ధావత్ లలో ఎం చేస్తున్నాడో ప్రజలకు తెలుసునన్నారు బాలకిషన్. ప్రజా క్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలో ముందుగా కవ్వంపల్లి నేర్చుకోవాలని, ఓ అడబిడ్డను అలా చేయడం ఎంటి వేరే మహిళ అయితే చెప్పుతో కొట్టేదన్నారు. అధికారంలో లేనప్పుడు లోపల చేసిన పనులు ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బహిరంగంగా చేస్తున్నాడని ఆయన అన్నారు.
