Rapido Driver and Customer Viral Video: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా కస్టమర్ బైక్ దిగకపోవడంతో అలానే తోసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది.
తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో బుక్ చేసుకున్న కస్టమర్‌ను అతడి గమ్యస్థానంలో దింపాల్సి ఉండగా.. మార్గమధ్యలో సడెన్‌గా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ర్యాపిడో డ్రైవర్.. కస్టమర్‌ను దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కోరాడు. అందుకు సదరు కస్టమర్ ససేమిరా అనడంతో.. ర్యాపిడో డ్రైవర్ షాక్ అయ్యాడు. ఇక చేసేదేం లేక స్కూటీపై అతన్ని కూర్చోబెట్టుకుని పెట్రోల్ బంక్ వరకూ తీసుకెళ్లాడు.
Also Read: Kelvin Kiptum Dies: ఘోర రోడ్డు ప్రమాదం.. మారథాన్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ మృతి!
ర్యాపిడో డ్రైవర్ స్కూటీపై కస్టమర్‌ను ఎక్కించుకుని తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలను రోడ్డుపై వెళుతున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇలా కూడా ఉంటారా?, ఇదెక్కడి కర్మ రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.