Dhurandhar Trailer: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఈ చిత్రంలో ఉగ్రవాదుల కర్కశత్వం, భారత్ వ్యూహాలకు సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
నాలుగు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ యాక్షన్‌తో నిండిపోయింది. ఇందులోని సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. రణ్‌వీర్ సింగ్ ఇందులో “రా” ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శత్రుదేశం పాకిస్థాన్‌కు వెళ్లిన రణ్‌వీర్ సింగ్ జీవితంలో ఎదురైన ఘట్టాలు ఈ చిత్రంలో ఉంటాయనిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆర్. మాధవన్ నటిస్తున్నారు. ఆయన NSA చీఫ్ అజిత్ దోవల్ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇండియన్ జేమ్స్ బాండ్ పాత్రంలో ఆర్. మాధవన్ నటనను చూసి వినియోగదారులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ మీరు ఈ ట్రైలర్‌ని చూశారా..?