Sabarmati Central Jail: హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను గుజరాత్ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarmati Central Jail: గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్ పాయిజన్‌తో ప్రజలను హత్య చేయడానికి కుట్ర పన్నిన హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను తోటి ఖైదీలు చితకబాదారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)తో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్‌పై జైలు లోపల దాడి జరిగింది. హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ ఇతర ఖైదీలు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
READ MORE: Astrology: నవంబర్ 19, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..!
Also Read
దాడి సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అతడి ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వర్గాలు తెలిపాయి. సెల్ వెలుపల ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి డాక్టర్ అహ్మద్‌ను ఖైదీల బారి నుంచి రక్షించింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుని, దాడి ఎందుకు జరిగిందని దర్యాప్తు ప్రారంభించింది. ఖైదీలు ఎందుకు ఆకస్మిక దాడికి పాల్పడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
READ MORE: Donald Trump: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై అమెరికా నిఘా నివేదికను తప్పుబట్టిన ట్రంప్..
డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ఎవరు?
నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతడు ఐసీస్‌కు చెందిన ఓ ప్రాంతీయ విభాగం.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌తో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్ ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే విషాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈక్రమంలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. మొహియుద్దీన్.. ఐఎస్‌కేపీకి చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుండేవాడని విచారణలో వెల్లడైంది. సదరు ఉగ్రవాది.. పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడని.. అతడే మొహియుద్దీన్‌కు అవసరమైన సమాచారం కూడా అందించేవాడని తెలిసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!