Dhurandhar Trailer: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధురంధర్'. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.