Site icon NTV Telugu

Dhurandhar : రణ్‌వీర్ ‘ధురంధర్’కు సౌత్ స్టార్ ఫిదా..

Surya Duran

Surya Duran

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎవ్వరు ఊహించని విధంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ కేవలం కలెక్షన్లకే పరిమితం కాకుండా, సినీ ప్రముఖుల మనసులను కూడా గెలుచుకుంటుంది. తాజాగా సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సూర్య స్పందిస్తూ.. ‘ధురంధర్ ఒక మాస్టర్ పీస్ మూవీ. దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరు అద్భుతంగా ఉంది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నాల మేకోవర్ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా మై బ్రదర్ ఆర్. మాధవన్ నటనకు ప్రత్యేక అభినందనలు. జస్పై థ్రిల్లర్ సినిమాలకు ఈ చిత్రం ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేసిందని, మేకర్స్ విజన్ చూసి నాకు సినిమాపై గౌరవం పెరిగింది’ అని సూర్య ట్వీట్ లో పేర్కొన్నాడు.

Also Read : MSG- Venky: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో వెంకటేష్ పాత్ర ఇదే..!

ఇప్పటికే అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ వంటి వారు ఈ సినిమాను మెచ్చుకోగా, ఇప్పుడు కోలీవుడ్ నుంచి సూర్య కూడా తోడవడంతో ‘ధురంధర్’ క్రేజ్ మరింత పెరిగింది. మరోవైపు సూర్య ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘కరుప్పు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ఫ్లాపుల తర్వాత సూర్య చేస్తున్న ఈ యాక్షన్ డివోషనల్ డ్రామా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో కూడా ‘ధురంధర్’ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించడం సూర్య సంస్కారానికి నిదర్శనమని అభిమానులు మురిసిపోతున్నారు.

 

Exit mobile version