Site icon NTV Telugu

Sita Reddy: మంచి చేసిన నేతను మళ్ళీ గెలిపించాలి..

Sitareddy

Sitareddy

ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో.. తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా సీతారెడ్డి ప్రసంగిస్తూ.. ప్రజల్లోనే ఉంటాను.. అందరికీ అందుబాటులో ఉంటానని రంజిత్ రెడ్డి చెప్పారన్నారు. ఈ 5 సంవత్సరాలో ఎంత కష్టమొచ్చినా, కరోనా కష్టకాలంలో ఎంతో సహాయం చేశారని తెలిపారు. తనకు తోచినంతగా సహాయం చేసేవారని చెప్పారు. ఆయనకు దురదృష్టవశాత్తు చేతి మడమ విరిగిందని.. డాక్టర్లు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారన్నారు. కానీ.. ప్రజల కష్టాలు తీర్చేందుకు తన గాయాన్ని లెక్క చేయకుండా కర్ర పట్టుకుని ప్రజల్లోకి వచ్చారని సీతారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పటాసులు పేలుస్తుండగా.. వచ్చి తన కాలు మీద పడి గాయం పెద్దదైందని చెప్పారు. అప్పుడు కూడా.. ప్రజలకు సమస్యలు ఉన్నాయంటే వెంటనే వెళ్లిపోయేవారని అన్నారు.

China knife attack: ఆస్పత్రి దాడిలో 10కి చేరిన మృతుల సంఖ్య

తాజాగా.. ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి కాలుకు గాయమైందని చెప్పారు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా.. ప్రచారం నిర్వహిస్తున్నారని సీతారెడ్డి తెలిపారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానం.. తనను ఎన్నుకున్న ప్రజలను మోసం చేయొద్దని ప్రజల్లోకి వెళ్లే వారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే.. ఎప్పటికి ప్రజల్లో ఉండే, మంచి చేసిన నేతనే ఎన్నుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

Exit mobile version