NTV Telugu Site icon

Rani Rudrama Devi: కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు..

Rani Rudrama

Rani Rudrama

కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దిక్కుమాలిన మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను బొంద పెట్టారని రాణి రుద్రమ మండిపడ్డారు. దేశ ప్రజలు మోడీకి ఓటు వేయాలని చూస్తున్నారు.. రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని ఇవాళ్టి నుంచి కార్లు, హెలికాప్టర్లు వాడకుండా కాలి నడకనే పరిపాలన సాగించాలని కోరారు. మరోవైపు.. రైతులు ఆగం అవుతుంటే, ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూసుకుంటా రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఆగం అయ్యిందని ఆమె పేర్కొన్నారు.

Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..
పదేళ్ల పాలనలో మోడీ ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారని రాణి రుద్రమ దేవి తెలిపారు. యువ న్యాయ్ గ్యారెంటీలో పొందుపరిచిన గిగ్ ఉద్యోగత అంటే ఏంటో రేవంత్ కు తెలుసా..? అని ప్రశ్నించారు. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి ఓపెన్ డిబేట్ కు రావాలన్నారు. కరోనా కష్ట కాలంలో ఆత్మనిర్భర్ భారత్ తో ప్రతి పౌరుడికి మోడీ భద్రత కల్పించారన్నారు. వంద రోజుల్లో ఏం చేశారో ప్రజలకు చెప్పి రేవంత్ రెడ్డి ఓట్లు అడగాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను తామే ఇచ్చినట్టుగా.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టి చూయించాలని సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. రాహల్ గాంధీ ప్రకటించిన ఐదు న్యాయాలు కనపడని ఆత్మల లాంటివేనని విమర్శించారు. ఉచిత ప్రయాణం తప్ప మీరు చేసిందేంటి..? ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ సంస్థ దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

Kangana Ranaut: కంగనా రనౌత్‌ పోస్ట్ పై స్పందించిన నేతాజీ కుటుంబ సభ్యులు..!

ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ నేతలంతా సిగ్గుపడాలని రాణి రుద్రమ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఆరోపించారు. గాంధీలు తప్ప కాంగ్రెస్ లో ఏ సామాజిక వర్గం బాగు పడింది లేదన్నారు. మా
మోడీ బీసీ.. కాంగ్రెస్ లో బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధాన మంత్రి ఒక్కరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలపై దృష్టి పెట్టాలి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తే బీజేపీగా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు వెంటాడుతామని ఆమె పేర్కొన్నారు.