Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangasamy Oath: పుదుచ్చేరి రాజకీయాల్లో మరోసారి రంగస్వామి (Rangasamy) హవా కొనసాగింది. ఐదోసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశనాథన్ ఆయనతో పదవి, గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నాబిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన రంగస్వామి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పుదుచ్చేరిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని రంగస్వామి ప్రకటించారు. మౌలిక వసతులు, పర్యాటకం, సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇక నమస్సివాయం కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, కొత్త పథకాలను కూడా ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే మల్లాది కృష్ణరావు కూడా త్వరలో మంత్రివర్గంలో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా సహకారం అందిస్తోందని, దాంతో పర్యాటకం, సదుపాయాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.
మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆల్ ఇండియా N.R. కాంగ్రెస్ (ఎన్ఆర్ కాంగ్రెస్) 12 స్థానాలు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలు సాధించింది. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం ఒక స్థానంలో విజయం సాధించింది. ప్రతిపక్షంగా ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం ఐదు స్థానాలు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. తమిళనాడులో సంచలన ఎంట్రీ ఇచ్చిన తమిళగ వెట్టిరి కజగం (TVK) పుదుచ్చేరిలో కూడా రెండు స్థానాలు గెలుచుకుని ఖాతా తెరిచింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..