Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చుట్టూ చిమ్మ చీకటి.. అమ్మా.. అమ్మా.. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నా తల్లి లేవడం లేదు. అసలు ఎక్కడ ఉన్నామో తెలియదు.. దిక్కులు పిక్కటిల్లేలా ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చింది. కానీ ఆ చిన్నారి రోదన అరణ్యంలో ఆర్తనాదం లాగే మిగిలిపోయింది. తెల్లారిన తర్వాత స్థానికులు వచ్చి చూసే సరికి.. తల్లి శవంగా పడి ఉంది. ఆ పక్కనే చిన్నారి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? ఆ తల్లిని చంపిందెవరు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
అది రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడ ప్రాంతం. ఉదయం పూట అటుగా వెళ్తున్న స్థానికులకు ఓ పొలంలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. ఆ పక్కనే తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారిని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. పోలీసుల దర్యాప్తులో మహిళను రంగారెడ్డిగూడకు చెందిన శోభగా గుర్తించారు.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
Also Read:BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..
రంగారెడ్డిగూడకు చెందిన శోభకు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండవాసితో పెళ్లి జరిగింది. వారికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గొడవలతో మూడున్నరేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఈమె అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో సహజీవనం చేస్తోంది. తర్వాత పాప మమత పుట్టింది. ప్రస్తుతం ఆ చిన్నారికి రెండున్నరేళ్లు. శోభకు నర్సింహులుతో కూడా కలహాలు రావడంతో పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి ఉంటోంది.
నర్సింహులు ఆమె కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని షాద్‌నగర్‌కు రమ్మన్నాడు. కుమారుడితో కలిసి అక్కడికి చేరుకున్న శోభ సాయంత్రం వరకు నర్సింహులు రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయింది. కుమారున్ని ఇంట్లోనే ఉంచి కుమార్తెతో కలిసి మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది. తిరిగి వెళ్తున్న ఆమెను విరన్నపేట్ వద్ద కలిసిన నర్సింహులు మళ్లీ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఐతే ఇంటికి వచ్చిన అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంలో నర్సింహులు ఆమె తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడంతో రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై ముందు డెడ్‌బాడీని పడుకోబెట్టి ఆమెపై ఒక బట్ట కప్పాడు. పాపను కూడా బైక్‌పై కూర్చోబెట్టుకుని షాద్‌నగర్ సమీపం వరకు వెళ్లి అక్కడే ఆమెను పడేశాడు. పాపను కూడా అక్కడే వదిలేసి నర్సింహులు వెళ్లిపోయాడు. అలా బైక్‌పై తీసుకు వెళ్లిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!