Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మాసిటీ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు ఇకపై అక్కడ వ్యవసాయం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించింది.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఆర్డీవో అనంతరెడ్డి శనివారం స్వయంగా పరిశీలించారు. నానక్ నగర్, మేడిపల్లి, కుర్మీద్ద, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి అసైన్డ్ భూముల స్థితిగతులను అంచనా వేశారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జారీ చేసిన తాజా ఆదేశాలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు.
Also Read
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
పంటల సాగుపై నిషేధం..
గతంలోనే ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 14 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరిగిందని ఆర్డీవో గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందుకున్న రైతులు, రాబోయే వర్షాకాలం సీజన్‌లో సేకరించిన భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు వేయకూడదని, ఎలాంటి పంటలు సాగు చేయవద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
నష్టపరిహారం పొందిన తర్వాత ఆ భూమిపై హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని, కాబట్టి అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. రైతులు అధికారుల సూచనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో స్థానిక తహశీల్దార్ అయ్యప్పతో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. భూముల స్వాధీనం విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. గతంలో భూసేకరణ సమయంలో కొన్ని గ్రామాల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. మెజారిటీ రైతులకు పరిహారం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములను అభివృద్ధి పనులకు సిద్ధం చేస్తున్న తరుణంలో.. అక్కడ మళ్లీ సాగు చేపడితే పనులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైనా ఆదేశాలు ధిక్కరించి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!