NTV Telugu Site icon

Hema Malini: హేమమాలినిపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు

Hemnea

Hemnea

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇటీవల సినీ నటి, మండీ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల దుమారమే ఇంకా చెల్లారకముందే మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఇరాకటంలో పడ్డారు. నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా నోరుపారేసుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి యువకుడితో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో కరెంట్ స్తంభమెక్కి హైడ్రామా..

హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియోను బీజేపీ పోస్టు చేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ బీజేపీ ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలు మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సుర్జేవాలాపై విరుచుకుపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దీనిపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయం కలిగిన కాంగ్రెస్ నేతలు.. ఓటమి భయంతోనే ఇలా దిగజారి మాట్లాడుతున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Pemmasani Chandrashekar: మంగళగిరి నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం

అయితే బీజేపీ చేస్తు్న్న విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తన ప్రసంగంలోని కొన్ని మాటలను తీసుకుని వక్రీకరిస్తున్నారని.. తన పూర్తి ప్రసంగాన్ని చూడాలని రణ్‌దీప్ సూర్జేవాలా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాము హేమమాలినిని ఎంతో గౌరవిస్తామని.. ఆమె ధర్మేంద్రను వివాహం చేసుకున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా ఆమె మా ప్రాంత కోడలు అని.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని సూర్జేవాల క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Raashii Khanna : హైదరాబాద్ లో మరో ఇల్లు కొన్న రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్..

ఇదిలా ఉంటే హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాకు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 9 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల కాంగ్రెస్ నేత సుప్రియా .. కంగనా రనౌత్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూడా దుమారం రేపింది. దీంతో ఆమెకు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.