Animal Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదే కథను మళ్లీ హిందీలో కబీర్ సింగ్ గా తెరపైకి తీసుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే స్క్రిప్ట్ సెట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ హీరోతో సినిమాకు ప్లాన్ చేశాడు.
Read Also:Karumuri Nageshwara Rao: పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తాం..
రణ్‌బీర్ కపూర్‌ని ఎనిమల్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో ఈ హీరో డిఫరెంట్ కిల్లర్ గా కనిపించబోతున్నాడని ఆ మధ్య లీక్ అయిన ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తూ వైల్డ్ ఫోటో విడుదల చేశారు. అందులో ఓ వైపు గొడ్డలి పట్టుకుని సిగరెట్ తాగుతున్న రణబీర్ కపూర్.. గాయాలు, రక్తంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. సినిమాలో విలన్లను ఊచకోత కోసినట్లు కనిపిస్తోంది.
Read Also:Mecca : 8600 కిలోమీటర్లు, 370 రోజులు కాలినడకన మక్కా చేరుకున్న కేరళ వాసి
క్రైమ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సందీప్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ పై పలు రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో దర్శకుడు కూడా అఫీషియల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు. యనిమల్ మూవీని ఆగస్ట్ 11, 2023న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వివరించారు. ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా పాన్ ఇండియా రిలీజ్ కాబోతోందని సమాచారం. సినిమా విడుదలకు రేపు(జూన్ 11) ఎనిమల్ సినిమా ప్రి టీజర్ విడుదల కానున్నట్లు చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. రేపు సరిగ్గా 11గంటల 11నిమిషాలకు ప్రి టీజర్ రిలీజ్ కానుంది. బ్రహ్మాస్త్ర 1 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న రణ్ బీర్ ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి.