టాలీవుడ్ స్టార్ హీరో హీరో దగ్గుబాటి రానాకు పాన్ ఇండియా స్థాయి లో భారీ క్రేజ్ ఉంది. బాహుబలి కంటే ముందే బాలీవుడ్‍లో రానా ఫేమస్ అయ్యారు.అయితే, బాహుబలి తర్వాత రానా క్రేజ్ నెక్ట్స్ లెవెల్‍కు వెళ్లింది. రానా నాయుడు వెబ్ సిరీస్‍తో ఓటీటీ స్పేస్‍లో కూడా రానా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓ ఓటీటీ లో టాక్‍షో చేసేందుకు సిద్ధం అయ్యారు.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో ‘ది రానా కనెక్షన్’ పేరుతో టాక్ షో హోస్ట్ చేయనున్నారు రానా. నేడు (మార్చి 19) జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‍లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియా కింద రానా ఈ టాక్ షో ను ప్రొడ్యూజ్ చేయనున్నారు.
ఇండియన్ సినిమా నుంచి తన ఫ్రెండ్స్, సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.సిద్ధంగా వున్నారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ‘ది రానా కనెక్షన్’ టాక్ షో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందనేది మాత్రం అమెజాన్ ప్రైమ్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.గతంలో రానా ‘నంబర్ 1 యారీ’ పేరుతో ఓ టాక్ షో కు హోస్ట్ గా చేశారు. ఇది ఆహా ఓటీటీలో ఎంతో పాపులర్ అయింది. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో ను నిర్వహించారు..అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేయనున్న ఈ ‘ది రానా కనెక్షన్’ టాక్ షో నేషనల్ వైడ్ గా ఉండనుందని తెలుస్తుంది.. టాలీవుడ్, బాలీవుడ్‍తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు కూడా ఈ టాక్ షో కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.