Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్ అంటేనే భగ్గుమంటున్న రానా దగ్గుబాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్ పై భళ్లాలదేవుడు భగ్గుమంటున్నాడు. ఆ సంస్థ అందిస్తోన్న సేవల పై దగ్గుబాటి రాణా తీవ్ర విమర్శలు చేశారు. అసలేం జరిగిందంటే… ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. షెడ్యూల్డ్ ఫ్లయిట్ కాకుండా మరో విమానంలో వెళ్లాలని సిబ్బంది రానాకు సూచించారు. లగేజి కూడా అదే విమానంలో వస్తుందని తెలిపారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజి మాత్రం రాలేదు. దాంతో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లగేజ్ మిస్ అయిందని, సిబ్బంది దాన్ని వెతికి పట్టుకోలేకపోయారంటూ ఆగ్రహించారు.
Read Also: Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
ఇండిగో ఎయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందంటూ ట్విటర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్త పరిచారు. ‘ఇండిగో విమాన సేవలు సరిగా లేవు. మిస్సైన లగేజ్ ట్రాకింగ్ కూడా సరిగా లేదు. ప్రయాణికుల లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు. ఇక్కడి సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదు’అని రానా ట్వీట్ చేశాడు. విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళతాయో తెలియదు… మిస్సయిన లగేజిని ఎలా కనుగొనాలో తెలియదు, ఈ విషయాలు సిబ్బందికే తెలియదు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు, ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రచార పోస్టులపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రానాకు మద్దతు ప్రకటించారు. గతంలో తమకు విమాన ప్రయాణాల్లో ఎదురైన అనుభవాలను వారు రానాతో పంచుకున్నారు.
India’s worst airline experience ever @IndiGo6E !! Clueless with flight times…Missing luggage not tracked…staff has no clue 💥 can it be any shittier !! pic.twitter.com/odnjiSJ3xy
— Rana Daggubati (@RanaDaggubati) December 4, 2022
తాజావార్తలు
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?