NTV Telugu Site icon

Ramzan Mubarak: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ

Modi

Modi

Ramzan Mubarak: రంజాన్ పవిత్ర మాసం భారతదేశంలో ప్రారంభమైంది. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజాలు) ప్రారంభించారు. శనివారం సాయంత్రం రంజాన్ మాసం చందమామ దర్శనమిచ్చిన తర్వాత ప్రజలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ తన ఎక్స్ (పాత ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ లో ” పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి, సౌహార్దం వెల్లివిరియాలి. ఈ పవిత్ర మాసం ఆత్మపరిశీలన, కృతజ్ఞత, భక్తి లక్షణాలను ప్రతిబింబిస్తూ.. మనకు దయ, సహానుభూతి, సేవ వంటి విలువలను గుర్తు చేస్తుంది. రంజాన్ ముబారక్!” అని తెలిపారు.

Read Also: Fake Darshan Tickets: శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు.. పోలీసులకు వరుస ఫిర్యాదులు

ఇక గత శుక్రవారం, జహాన్-ఏ-ఖుస్రో 25వ ఎడిషన్ లో ప్రధాని పాల్గొని రంజాన్ పండుగకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశపు సూఫీ సంప్రదాయం అందించే సందేశాన్ని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అధికారిక ప్రకటనలో “ఈ పవిత్ర దినాలలో ఉపవాసం, ఆత్మ నియంత్రణ, సహనం, పూజ వంటి మంచిపనులు సహనం, సరళత, పరస్పర సోదరత్వం వంటి విలువలను పెంపొందిస్తాయి” అని ఆయన అన్నారు.

Read Also: SBI ATM: బరితెగించిన దొంగలు.. ఏటీఎం పగలగొట్టి రూ.30లక్షల చోరీ

రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. వీటిని రోజాలు అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, చందమామ కనిపించడం ద్వారా కొత్త మాసం ప్రారంభమవుతుంది. ఈ ఇస్లామిక్ మాసాలు 29 లేదా 30 రోజులు ఉంటాయి. రంజాన్ ముగిసిన తర్వాతి రోజు ఈద్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ సమయంలో ముస్లింలు నెల పొడవునా నిబంధనలను పాటిస్తూ, ప్రార్థనలు (ఇబాదత్) చేస్తూ ఉంటారు.