Vijaya Shanthi : ట్వీట్ చేసిన రాములమ్మ.. కమలం వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య లొల్లి ఆగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి.. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. ఇన్నాళ్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడ రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ లను ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పలు సూచనలు చేశారు. నిరంతరం తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో తన బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ విమర్శల దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు.
ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక,ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల,సవాళ్ల దాడులు, బీఆరెస్‌కు వేడుకలవుతున్నాయి. బీఆరెస్‌తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ గారు,ఈటలగారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో
Also Read
- Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2023
Also Read : Shriya : 20ఏళ్ల తర్వాత చిరుతో చిందేయనున్న శ్రియ
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కొంచెం ఆలోచించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ చెప్పడం తన బాధ్యత అన్నారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోందని విజయశాంతి పేర్కొన్నారు. ఇది మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమని తెలిపారు.
Also Read : Prabhas: ఒకడే ఇద్దరు కదా… ‘రాముడు’ మరియు ‘రాక్షసుడు’
దీనికి గల కారణాలు కూడా ఉన్నాయాని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడ వలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉందనేది నిజమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటలు, సవాళ్ల దాడులు, బీఆర్ఎస్ కు వేడుకలవుతున్నాయని విజయశాంతి చెప్పుకొచ్చారు. మరి విజయశాంతి మాటలను రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ వింటారో లేదో చూడాలి మరీ..
తాజావార్తలు
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!