ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో… ఇది కదా కటౌట్ అంటే.. ఇది కదా హీరో మేటిరియల్.. అనాలనిపించే ఏకైక కటౌట్ కేవలం ప్రభాస్‌కు మాత్రమే సొంతం. ఇప్పటివరకు ప్రభాస్ కటౌట్‌ని సాలిడ్‌గా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళిదే టాప్ ప్లేస్. ఛత్రపతి సినిమాలో ఈ ఆరడుగుల బుల్లెట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన జక్కన్న, బాహుబలితో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్ కటౌట్ పై కాస్త ట్రోలింగ్ జరిగింది. సాహో, రాధే శ్యామ్ సినిమాల్లో ఫిజికల్‌గా ప్రభాస్ లుక్ బాగాలేదనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు రాముడైనా, రాక్షసుడైనా ప్రభాస్ తర్వాతే ఎవ్వరైనా అనేలా ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం రాముడిగా, రాక్షసుడిగా నటిస్తున్న హీరో ప్రభాస్‌నే కావడం విశేషం. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు.
ఆదిపురుష్‌లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్.. సలార్‌లో మోస్ట్ వయోలెంట్ మాన్ గా ఓ రోల్ ప్లే చేస్తున్నాడు. అసలు ఏ మాత్రం కనికరం లేకుండా విలన్ ని ప్రభాస్ ఊచకోత కోస్తాడట. ఇప్పటికే రిలీజ్ చేసిన సలార్ పోస్టర్స్‌లలో.. కదన రంగంలో కత్తులు పట్టిన ప్రభాస్‌ను చూసి.. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకుంటున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసి ఆదిపురుష్ పోస్టర్ చూస్తే.. దిమ్మ తిరగాల్సిందే. ఒకవేళ రాముడు ఉండి ఉంటే.. ఇలాగే ఉండే వాడేమో అనేలా ప్రభాస్ విల్లు పట్టిన పోస్టర్ ఉంది. దీంతో రాముడైనా, రాక్షసుడైనా మా డార్లింగ్ తర్వాతేనని.. మురిసిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఒకసారి సలార్, ఆదిపురుష్ కటౌట్స్‌ని పక్క పక్కన పెట్టి చూస్తే ప్రభాస్ ‘నెక్స్ట్ లెవల్’ అనేలా ఉన్నాడు. మరి ఈ కటౌట్స్‌కి తగ్గట్టుగా ఆదిపురుష్, సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.