UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Election Commission: ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో ‘రామ్ నే యాదవ్ కో మారా’ (రాముడు యాదవ్‌ను కొట్టాడు) అని వింతగా ఉన్న ఒక పేరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ దీనిపై స్పందిస్తూ, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతతో పాటు వారి సాఫ్ట్వేర్ పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. అయితే, ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా నుంచి వచ్చిన ఘాటైన సమాధానం వివాదాన్ని మరింత రాజేసింది. ప్రభుత్వ సంస్థకు తగని రీతిలో ఆ వ్యాఖ్యలు ఉండటంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో సీఈవో యూపీ తాజాగా తన తప్పును అంగీకరిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో సంభాషణలు ఎల్లప్పుడూ సభ్యాతిసభ్యలతో, అధికారికంగానే ఉంటాయని హామీ ఇచ్చారు.
అసలు ఏంటి ఈ వివాదం..?
అసలు ఈ రగడ అంతా బలియా శాసన మండలి నియోజకవర్గ ఓటర్ల జాబితాతో మొదలైంది. రామ్హిత్యాదవ్ అనే ఓటరు పేరును ఈసీ సాఫ్ట్వేర్ చిత్రవిచిత్రంగా అనువాదం చేసింది. రామ్హిత్యాదవ్ అనే పేరును రామ్ హిట్ యాదవ్ అని ఇంగ్లిషులో అర్థం చేసుకున్న సాఫ్ట్వేర్.. ‘రామ్‌నే యాదవ్ కో మారా’ అంటూ హిందీలో పేర్కొంది. ఆ జాబితాలో ఈ వివాదాస్పద పేరును చూసిన ఆప్ నేత రాజేష్ యాదవ్, ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంప్యూటర్ పొరపాటున కూడా యాదవ్ అనే పేరునే ఎందుకు టార్గెట్ చేసిందంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. సీఈవో ఉత్తర ప్రదేశ్ అధికారిక ఖాతా వ్యంగ్య ధోరణిలో స్పందిస్తూ, కంప్యూటర్‌కు ఎలాంటి కుల పిచ్చి ఉండదని, అదృష్టవశాత్తూ ఈ పొరపాటులో కులం కానీ లేదా ఏ మైనారిటీ పట్ల కానీ వివక్ష జరగలేదంటూ సమాధానమిచ్చింది. ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిక ఖాతా నుంచి వచ్చిన ఈ భాష ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
Also Read
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
- CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
- Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
- Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో సీఈవో ఉత్తర ప్రదేశ్ దిగిరాక తప్పలేదు. తాజాగా మరో పోస్ట్ పెడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ అధికారిక ఖాతా నుంచి వచ్చిన సమాధానాల్లో ఉపయోగించిన భాష, భావం, పదునైన శైలి ఒక ప్రభుత్వ సంస్థ గౌరవానికి, స్థాయికి తగినట్లుగా లేవని అంగీకరించారు. ఈ వ్యాఖ్యల వల్ల మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జరిగే ప్రతి సంభాషణ పూర్తిగా మర్యాదపూర్వకంగా, నియమబద్ధంగా, అధికారిక శైలిలోనే ఉండేలా చూసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!