టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.
PM Modi: భారత్‌కి ప్రధాని మోడీ నాయకత్వం అవసరం.. వక్ఫ్ బోర్డు చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..
కాగా.. అనంతరం మే 22న నాలుగు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో.. రమీజ్ రజా ఇంకా జట్టును ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటగాళ్లంతా విచారణలో ఉన్నారని తెలిపారు. రమీజ్ రజా తన యూట్యూబ్ ఛానెల్‌లో పీసీబీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ఇంకా ప్రకటించని ఏకైక జట్టు పాకిస్తాన్ మాత్రమేనని అని పేర్కొన్నారు. 20 జట్లలో 19 జట్లు తమ జట్టులను ప్రకటించాయని.. పాకిస్తాన్ ఎందుకు ప్రకటించలేదో అర్థం కావడం లేదన్నారు.
IPL 2024: ప్లేఆఫ్స్కు వెళ్లే 4 జట్లు ఇవే..? క్రికెట్ దిగ్గజాల అంచనా
అయితే.. పాకిస్తాన్ జట్టులో కొందరు బౌలర్లు ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోందని రమీజ్ రజా అన్నారు. హసన్ అలీ ప్రదర్శన పేలవంగా ఉంది.. మహ్మద్ అమీర్ ప్రదర్శన కూడా బ్యాడ్ గా ఉంది. షాహిద్ అఫ్రిది బౌలింగ్ లో ఎలా రాణిస్తాడనేది సందేహంగా ఉందని.. పీసీబీ త్వరగా ప్రపంచకప్ జట్టును ప్రకటించాలని రమీజ్ రజా కోరారు. మరోవైపు.. ఐర్లాండ్‌పై బాబర్ అజామ్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని, ఈ ఇన్నింగ్స్‌లో బాగా ఆడినట్లు రమీజ్ చెప్పుకొచ్చాడు. కాగా.. సామ్ అయూబ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదని.. జట్టుకు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడని తెలిపారు.