మెగా కుటుంబలో సంతోషం డబుల్ కాబోతుంది. 2012లో రామ్ చరణ్ – ఉపాసన వివాహం జరగగా 2023 జూన్ 20న మొదటి బిడ్డ ‘క్లిన్ కారా కొణిదెల’ జన్మియించింది. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులు మరో గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ స్టార్ కపుల్ ఇప్పుడు ట్విన్స్‌కు తల్లిదండ్రులు కాబోతున్నారు. గతేదాడి దీపావళి కానుకగా ఉపాసన శీమంతం గ్రాండ్ గా చేసారు.
Also Read : Atlee : దీపికా పదుకొనే నా అదృష్ట దేవత : డైరెక్టర్ అట్లీ
ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం, రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఈనెల చివర అనగా జనవరి 31న ఇద్దరు మగ పిల్లలకు స్వాగతం పలకనున్నారట. ఈ వార్త మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. మెగా ఫ్యామిలీలో ఇది మరో పెద్ద సంబరంగా మారనుంది. మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇటీవల రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ సినిమాతో ఫుల్ ట్రీట్ ఇచ్చారు. ఆ ఆనందంలో ఫుల్ ఖుషిగా మెగా ఫ్యామిలీ ఇప్పుడు బుల్లి రామ్ చరణ్స్ రాకతో మరింత సంతోషంలో ఉన్నారు. అటు చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పడు చరణ్ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి శుభవార్త రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.