ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు రాంచరణ్.. ఆ సినిమా తర్వాత ఆచార్యలో చిరంజీవితో కలిసి కనిపించినా..ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అప్పటి నుంచీ అతని నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఆ సినిమా కూడా అంతకంతకు ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సర్‌ప్రైజింగ్ వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా రామ్ చరణ్ ఇండియన్ 3 మూవీలో నటించబోతున్నాడన్న వార్త తెగ వైరల్ అవుతుంది.. ఇప్పటికే దళపతి విజయ్ మూవీలో రాంచరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని బజ్ క్రియేటైన విషయం తెలిసిందే.అయితే అందులో నిజం లేదని లియో టీమ్ ఇప్పటికే తేల్చేయడంతో అతని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇక ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న శంకర్ తోనే చరణ్ ఇండియన్ 3 చేయబోతున్నాడని న్యూస్ తెగ వైరల్ అవుతుంది..
ఓ వైపు గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూనే ఇండియన్ 2 మూవీ చేస్తున్న శంకర్.. అప్పుడే ఇండియన్ 3కి కూడా రెడీ అయిపోతున్నాడని, అందులో చరణ్ నటించబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి.అంతేకాదు ఇండియన్ 2 క్లైమ్యాక్స్ లో చరణ్ స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ ముగియగానే చరణ్ తో శంకర్ మరో సినిమా చేస్తున్నాడని, అది ఇండియన్ 3 అని వార్తలు వస్తున్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రాంచరణ్ కు సంబంధించి ఏ వార్త వచ్చిన కూడా ఫ్యాన్స్ ఎంతగానో వైరల్ చేస్తున్నారు.అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియకపోయినా నిజం కావాలని అతని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.అయితే రాంచరణ్ ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ మూవీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఎంతో ఆలస్యమైన ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ డేట్ కూడ మిస్సయింది. ఇక సమ్మర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తో రాంచరణ్ సినిమా చేస్తున్నాడు.